భారతదేశానికి హుమయూన్ రెండవ మొగల్ చక్రవర్తి. ఇతని పరిపాలనా కాలం క్రీ.శకం 1530 నుండి 1556 వరకు. 1530 సం.లో తన 23వ ఏట మొగల్ సింహాసనాన్ని అధిష్టించాడు. సూర్ వంశీయుడైన షేర్షా చేతిలో ఓడిపొయి దేశం విడిచి పోయాడు. ఈ సమయంలో ఇతని భార్యకు అక్బర్ జన్మిస్తాడు. 1555 సంలో పర్షియా రాజు సాయంతో అప్పటి ఢిల్లీ పరిపాలకుడు షెర్షా వంశీయుడైన ఆదిల్ నూర్ ను, ఇతని మంత్రి హేమూను జయించి తిరిగి ఢిల్లీ పిఠం అధిష్టిస్తాడు.
తరవాత కొద్దికాలానికే 1556 సం.లో మరణిస్తాడు. తరువాత ఇతని కుమారుడు అక్బర్ అధికారంలోకి వస్తాడు.